Published : 04/04/2020 02:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పాపం పసివాళ్లు!

అమ్మ కావాలి నాన్నా..
బేల చూపుల జాలి కథ

ఈ ఫొటోలోని ముద్దులొలికే పాపలిద్దరిదీ.. గుండెను పిండేసేంత బాధామయ గాథ. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని లక్ష్మీనర్సింహ కాలనీలో శుక్రవారం హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. అనారోగ్యం, దుర్భర దారిద్య్రంతో ఈ చిన్నారుల తల్లి చనిపోయింది. విగతజీవిగా పడిఉన్న అమ్మను చూసి..ఆమెకు ఏమైందో తెలియక మూడేళ్ల గాయత్రి, ఏడాది పసిబిడ్డ అనుష్క బేలగా చూస్తుండటం స్థానికులను కంటతడి పెట్టించింది. వీరి తల్లి శ్రీలత (27)ది నిరుపేద కుటుంబం. భర్త సంపాదన సరిపోక ఆర్థికంగా చితికిపోయిన స్థితి. దీంతో ఇంటి పోషణ భారాన్ని ఆమె తీసుకుంది. అక్కడా, ఇక్కడా పనిచేస్తూ ఎలాగో నెట్టుకొచ్చేది. కొద్ది నెలల క్రితం అనారోగ్యంతో మంచం పట్టింది. ప్రస్తుతం శాశ్వతంగా కన్నుమూయడంతో పిల్లలిద్దరూ అమ్మలేనివాళ్లయ్యారు.

-న్యూస్‌టుడే, షాద్‌నగర్‌ పట్టణం

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని