
పేద కుటుంబాలకు చేయూత
మల్లాపూర్: మల్లాపూర్ డివిజన్లోని 200 మంది నిరుపేదలకు రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శనివారం నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా లాక్డౌన్లో ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకుంటామని సంఘం సభ్యులు తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని సూచించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రాకూడదని కార్పొరేటర్ పి.దేవేందర్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు దోమ శ్రీనివాస్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, ముత్యం రెడ్డి, ధర్మారెడ్డి, తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Tags :