close

మంగళవారం, జులై 14, 2020

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఇది నిర్లక్ష్య డ్రైవింగ్‌.. ఏం చేద్దాం!

సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసుల ప్రశ్న

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: ‘‘నగరవాసులారా.. ఈ చిత్రం చూస్తుంటే మీకేమనిపిస్తోంది?’’- సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు ట్విటర్‌ వేదికగా సోమవారం ఓ నిర్లక్ష్యపు వాహనదారుడి చిత్రాన్ని పంచుకుని అడిగిన ప్రశ్న ఇది. ఓ వాహనదారుడు శిరస్త్రాణం ధరించకుండా.. చరవాణిలో మాట్లాడుతూ వాహనం నడిపించాడు. దీనికితోడు వెనుకాలే ఓ చిన్నపాప వెనక్కి తిరిగి ప్రమాదకరంగా కూర్చుంది. ఆదివారం రాత్రి మణికొండ ప్రాంతంలో తీసిన ఈ చిత్రాన్ని పోస్ట్‌ చేసి నెటిజన్ల అభిప్రాయం అడిగారు పోలీసులు. ఇలాంటి వారికి ఎంత జరిమానా విధించినా తక్కువేనని ఓ వ్యక్తి బదులిస్తే.. ఆ పాప భవిష్యత్తుకు ఇలాంటి పాఠమేనా నేర్పించేదంటూ మరొకరు ప్రశ్నించారు. నగర వాహనదారుల అవగాహన కోసమే ఈ పోస్ట్‌ పెట్టామని బదులిస్తూనే.. ఆ వాహనదారుడికి రూ.2,235 జరిమానా విధించినట్లు పోలీసులు వెల్లడించారు

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.