close

సోమవారం, జులై 13, 2020

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
17 వేల మంది గృహనిర్బంధం

ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న అధికారుల పర్యవేక్షణ

ఈనాడు డిజిటల్‌, వికారాబాద్‌: తాండూరు టౌన్‌, తాండూరు గ్రామీణ, ధారూర్‌, మోమిన్‌పేట, న్యూస్‌టుడే: జిల్లాలో అయిదు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో తాండూరు, ధారూర్‌, కుల్కచర్ల మండలాల్లోని ప్రాంతాలతో పాటు బొంరాస్‌పేట్‌, దౌల్తాబాద్‌, మోమిన్‌పేట మండలాల్లోనూ..రెండు రోజులుగా 17,079 మందిని గృహనిర్బంధం చేశామని జిల్లా వైద్యాధిÅకారి దశరథ్‌ తెలిపారు. అందరు ఆరోగ్యంగా ఉన్నారని, నమూనాలు సేకరించలేదన్నారు. వీరి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని స్పష్టం చేశారు. కరోనా ప్రభావిత ప్రాంతాలను వైద్య, పోలీసు, రెవెన్యూ అధికారుల బృందాలు పర్యవేక్షిస్తున్నాయి. పాజిటివ్‌ కేసులు నమోదైన అనుమానిత గ్రామాల్లో ఆరోగ్య సమాచారాన్ని సేకరిస్తున్నారు. తాండూరు పట్టణం, ధారూర్‌ మండలం గట్టెపల్లి గ్రామాన్ని ఆర్డీఓలు వేణుమాధవ్‌, ఉపేందర్‌రెడ్డి సందర్శించారు. ఆయా గ్రామాల్లో ప్రజలు బయటకు రాకుండా పోలీసులు కట్టడి చేశారు.
నిత్యావసరాల సరఫరా బాధ్యత ఆర్‌ఐలకు: నిర్బంధంలో ఉన్న కుటుంబాలకు నిత్యావసరాలు సరఫరా చేసే బాధ్యతను ఆర్‌ఐలకు అప్పగించారు. వారికి ఇబ్బంది లేకుండా చూడాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. తాండూరు పట్టణంలో క్వారంటైన్‌ పరిధిని తగ్గించారు. బాధితుని ఇంటి చుట్టూ 50 అడుగుల దూరంలో ఉన్న సుమారు 20 నివాస గృహాలకు మాత్రమే కట్టడి విధించారు.
చింతామణిపట్నంలో: చింతామణిపట్నంలో అనుమానితుని కుటుంబాన్ని గురువారం తాండూరు ఆర్డీఓ వేణుమాధవరావు క్వారంటైన్‌కు పంపించారు. రెండురోజులక్రితం పట్టణంలో చిన్నారికి కరోనా పాజిటివ్‌ వచ్చిన కుటుంబానికి ఆయన ప్రతిరోజు పాలు సరఫరా చేశారు. ఈ క్రమంలో ఆయనతోపాటు కుటుంబసభ్యులను 28రోజులపాటు నిర్బంధంలో ఉండాలని ఆర్డీఓ సూచించారు. జిన్‌గుర్తి ఆస్పత్రి వైద్యురాలు అపూర్వరెడ్డి బృందం  వారి ఆరోగ్య పరిస్థితిని  తెలుసుకున్నారు. వీరి కుటుంబానికి అవసరమైన నిత్యావసరాలను వీఆర్‌ఓ అంజిలయ్య, సర్పంచి విమలమ్మల  ద్వారా అందించాలని సూచించారు. గ్రామస్థుల ఇంటింటికి వెళ్లి ఆరోగ్య వివరాలను నమోదు చేయాల్సిందిగా ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలను ఆదేశించారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.