మేయర్‌ కార్యాలయం మూసివేత
logo
Published : 11/06/2020 03:18 IST

మేయర్‌ కార్యాలయం మూసివేత

జీహెచ్‌ఎంసీలో కరోనా కలకలం
రెండు రోజుల్లో ఇద్దరికి పాజిటివ్‌

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో కరోనా విస్తరిస్తోంది. మేయర్‌ బొంతు రామ్మోహన్‌ పేషీలో పనిచేసే ఓ ఉద్యోగికి పాజిటివ్‌ తేలింది. దీంతో మేయర్‌ కార్యాలయాన్ని బుధవారం మూసివేశారు. నాలుగో అంతస్తులో పనిచేసే ఒక జూనియర్‌ అసిస్టెంట్‌కు కరోనా వ్యాధి నిర్ధారణ అయిన రెండు రోజులకే మొదటి అంతస్తులో పనిచేసే వ్యక్తి(28)కి రావడం ఆందోళన కలిగిస్తోంది. ఘన వ్యర్థాల విభాగంలో పనిచేసే జూనియర్‌ అసిస్టెంట్‌ ఎక్కువగా మేయర్‌ పేషీలో తిరుగుతుండటంతో ప్రైమరీ కాంటాక్ట్‌లు 22 మందికి మంగళవారం కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. బుధవారం 21 మందికి నెగెటివ్‌ రాగా ఓ ఉద్యోగికి పాజిటివ్‌ వచ్చింది. అతను మంగళవారం విధుల్లో పాల్గొన్నట్లు చెబుతున్నారు. తాజాగా నాలుగో అంతస్తులో పనిచేసే 19 మందికి పరీక్షలు నిర్వహించగా గురువారం ఫలితాలు రానున్నాయి. ఏడంతస్తుల బల్దియా కార్యాలయంలో 1500 మంది పనిచేస్తున్నారు. మేయర్‌, కమిషనర్‌తోపాటు కొంతమంది ఉన్నతాధికారులు రాత్రి వరకు విధుల్లో ఉంటారు. విభాగాల వద్ద పనిచేసే సహాయకులే వైరస్‌ బారిన పడటంతో అధికారుల్లో ఆందోళన నెలకొంది. ఇంటి నుంచి పనిచేసేలా కొంతమందికి ఆదేశాలివ్వడంతోపాటు సీటింగ్‌లో మార్పులు చేయాలని కోరుతున్నారు. కార్యాలయం మొత్తాన్ని శానిటైజ్‌ చేశారు. 3 రోజులపాటు కార్యాలయాన్ని మూసివేయనున్నట్లు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని