close

శనివారం, ఆగస్టు 15, 2020

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
దానకర్ణుడనని చెప్పి దోచేశాడు!

రూ.11.60 లక్షలకు టోకరా

నారాయణగూడ: ‘డబ్బు అందరూ సంపాదిస్తారు. కొందరే తమ సంపాదనలో కొంత పేదల కోసం ఖర్చు పెడతారు. నేనూ అంతే.. నా సంపాదనలో కొంతైనా ఖర్చుపెట్టాలని నిర్ణయించుకున్నా.. నా ఈ బృహత్‌ సంకల్పానికి మీరే వారధి కావాలని’ గొప్ప దానకర్ణుడిగా మాట్లాడిన ఓ వ్యక్తి.. నగరవాసికి రూ.లక్షల్లో టోకరా వేశాడు. హైదరాబాద్‌ సైబర్‌ క్రైం సీఐ మోహన్‌రావు కథనం ప్రకారం.. ఇటీవల మెహిదీపట్నానికి చెందిన పవన్‌కుమార్‌కు లండన్‌లో ఉంటున్నానంటూ ఓ వ్యక్తి సామాజిక మాధ్యమాల ద్వారా స్నేహితుడయ్యాడు. చాలావిషయాలు పంచుకున్నారు. అభిరుచులు చెప్పుకొన్నారు. ‘లండన్‌లో క్రిస్టియన్‌ మిషనరీ నిర్వహిస్తూ.. నా సంపాదనలో కొంత సమాజానికి ఖర్చు పెడుతుంటా.. భారతదేశంలోనూ ఏదైనా సేవా కార్యక్రమం చేయాలని దానికి మీరు వారధిగా ఉంటే బాగుంటుంద’ని లండన్‌వాసి చెప్పాడు. మీకు రూ.30 వేల పౌండ్లు పంపిస్తాను.. ఆ డబ్బును ప్రజాసేవకు ఖర్చు చేయాలని సూచించాడు. ఉదయమే పవన్‌కి ఒకరు ఫోన్‌ చేసి దిల్లీ విమానాశ్రయం నుంచి మాట్లాడుతున్నట్లు చెప్పాడు. మీకు బ్రిటన్‌ పౌండ్లు వచ్చాయి.. వీటిని రూపాయలుగా మార్చడానికి రూ.11.60 లక్షలు ఖర్చవుతాయని చెప్పి ఆన్‌లైన్‌లో వేయించుకున్నాడు. పౌండ్లు తనకు అందలేదన్న విషయం స్నేహితుడికి చెబుదామంటే ఫోన్‌ అపేసి ఉంది. బాధితుడు సైబర్‌ పోలీసులను ఆశ్రయించారు.


ఎనీ డెస్క్‌ యాప్‌తో టోకరా

నారాయణగూడ: లక్షల విలువైన వస్తువులు అతి తక్కువ ధరలకే అమ్ముతామంటూ సామాజిక మాధ్యమాల్లో పెట్టే ప్రకటనలు చూసి నమ్మి చాలామంది మోసపోతున్నారు.. ఈ ప్రకటనలన్నీ ఇలాంటివే. ‘ఎనీ డెస్క్‌ యాప్‌’ డౌన్‌లోడ్‌ చేయించి డబ్బులు కాజేసిన ఘటన ఇది. హైదరాబాద్‌ సైబర్‌ పోలీసుల కథనం ప్రకారం.. లంగర్‌హౌస్‌కు చెందిన అమర్‌ యాదవ్‌కు బ్యాంక్‌ కస్టమర్‌ కేర్‌ నుంచి మాట్లాడుతున్నట్లు ఓ వ్యక్తి ఫోన్‌ చేశాడు. బ్యాంకు ఖాతాను అప్‌డేట్‌ చేయించుకోండని సలహా ఇచ్చాడు. ‘ఎనీ డెస్క్‌ యాప్‌’ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించాడు. నమ్మి ఆ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్న కొద్దిసేపటికే అమర్‌.. ఖాతాలోంచి రూ.55 వేలు డ్రా అయ్యాయి. తిరిగి ఆ వ్యక్తికి ఫోన్‌ చేస్తే ఆపేసి ఉంది.


 

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.