close

శనివారం, సెప్టెంబర్ 19, 2020

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రబ్బర్‌ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం


పరిశ్రమలో ఎగసిపడుతున్న మంటలు, పొగ

మల్లాపూర్‌, నాచారం న్యూస్‌టుడే: నాచారం పారిశ్రామికవాడ పరిధిలోని ఓ పరిశ్రమలో ఆదివారం సాయంత్రం విద్యుదాఘాతంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కార్మికులు సిలిండర్ల తీసుకొని బయటకు పరుగులు తీయడంతో పెను ప్రమాదం తప్పింది. భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. కార్మికులు, అధికారులు కథనం ప్రకారం.. నాచారం పారిశ్రామికవాడలో 20 ఏళ్లుగా సెమ్‌కాన్‌ రబ్బరు పరిశ్రమ కొనసాగుతోంది. 60 మంది కార్మికులు పనిచేస్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో 30 మంది మాత్రమే వచ్చారు. సాయంత్రం వర్షం కురుస్తుండగా ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. ఏం జరుగుతుందో తెలియక కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు బయటకు పరుగులు తీశారు. పెద్ద ఎత్తున నిల్వ ఉన్న రబ్బరుకు మంటలు అంటుకోవడంతో కంపెనీ పూర్తిగా దగ్ధమైంది. మల్కాజిగిరి, మౌలాలి, సికింద్రాబాద్‌, చర్లపల్లికి చెందిన అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపులోకి తెచ్చారు. విద్యుదాఘాతంతోనే ప్రమాదం జరిగినట్లు జిల్లా అగ్నిమాపక సహాయ అధికారి శంకరలింగం చెప్పారు. కంపెనీలో ఉన్న సిలిండర్లకు మంటలు అంటుకోకుండా కార్మికులు వాటిని సకాలంలో తొలగించడంతో పెనుప్రమాదం తప్పిందన్నారు. పరిశ్రమలో వస్తువులు పూర్తిగా కాలిపోయాయన్నారు. నాచారం సీఐ కిరణ్‌కుమార్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పరిశ్రమ సమీపంలో ఉన్న కేఎల్‌రెడ్డినగర్‌, హెచ్‌సీఎల్‌కాలనీల ప్రజలు భయంతో బయటకు వచ్చారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.