close

శుక్రవారం, సెప్టెంబర్ 25, 2020

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కరోనా మృతదేహాల తరలింపునకు ఉచిత అంబులెన్స్‌లు

రాచకొండ కమిషనరేట్‌లో ప్రారంభించిన సీపీ మహేష్‌ భగవత్‌

అంబులెన్స్‌ సేవల్ని వివరిస్తున్న రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌

నేరేడ్‌మెట్‌, న్యూస్‌టుడే: కరోనాతో ఆసుపత్రుల్లో మృతి చెందిన వారి దేహాల్ని శ్మశానవాటికకు తరలించేందుకు ఉచిత అంబులెన్స్‌ సేవల్ని రాచకొండ సీపీ మహేష్‌భగవత్‌ ప్రారంభించారు. కమిషనరేట్‌లో శనివారం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఫీడ్‌ ద నీడీ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఈ అంబులెన్స్‌ను సమకూర్చారు. సీపీ మాట్లాడుతూ కరోనా మృతుల దేహాలను శ్మశానవాటికకు తరలించడం పేదలకు భారంగా మారిందన్నారు. అలాంటి వారి కోసం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 వరకు ఈ వాహనాలు ఉచితంగా సేవలందిస్తాయన్నారు. అవసరమున్నవారు ఫోన్‌: 79954 04040లో లేదా రాచకొండ కమిషనరేట్‌ కంట్రోల్‌రూం ఫోన్‌: 94906 17234లో సంప్రదించాలని కోరారు. ఈ సేవా కార్యక్రమంలో ముందున్న స్వచ్ఛంద సంస్థను ఆయన ఆభినందించారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.