close

బుధవారం, సెప్టెంబర్ 30, 2020

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రెండ్రోజుల్లో 26 బస్తీ దవాఖానాలు

అధికారులతో మంత్రి తలసాని సమీక్ష

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: నగరంలో త్వరలో మరో 26 బస్తీ దవాఖానాలు అందుబాటులోకి రానున్నాయి. వాటిని ఈనెల 14న ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రారంభ ఏర్పాట్లపై అధికారులతో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సమీక్ష నిర్వహించారు. మంగళవారం మాసబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌కుమార్‌, హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ శ్వేతా మహంతి, రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌, 3 జిల్లాల వైద్యాధికారులు హాజరయ్యారు. పేద ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకే వీటిని ప్రారంభిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం 197 బస్తీ దవాఖానాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.