close

గురువారం, అక్టోబర్ 22, 2020

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
లక్షన్నరకే ఇల్లన్నారు.. కోటి కొల్లగొట్టారు!

రెండు పడక గదుల ఇళ్ల పేరిట 89 మందికి టోకరా

ముగ్గురి అరెస్ట్‌


నిందితులు పద్మదుర్గ, వరప్రసాద్‌, వెంకటేశ్వరరాజు

ఈనాడు, హైదరాబాద్‌: రెండు పడక గదుల ఇళ్లు ఇప్పిస్తామని 89 మందిని నమ్మించి రూ.1.03 కోట్లు వసూలు చేసిన ముగ్గుర్ని సైబరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రూ.72.8 లక్షలు, రూ.29.50 లక్షల విలువైన భూదస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. వివరాలను శుక్రవారం సైబరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌ మీడియాకు వెల్లడించారు. వెలిశెట్టి వెంకట సత్యకృష్ణ వరప్రసాద్‌(43) స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ. సూరారం చౌరస్తాలోని వెంకట్రామ్‌నగర్‌లో ఉంటున్నాడు. ఓరోజు మద్యం దుకాణంలో ఇద్దరు వ్యక్తులు.. రెండు పడక గదుల ఇళ్ల పేరిట నకిలీ ఉత్తర్వులు సృష్టించి ఎలా మోసగించాలో మాట్లాడుకోవడం విన్నాడు. ఆ ఉత్తర్వుల నకలును తీసుకొని బౌరంపేట్‌లో నకిలీవి తయారు చేయించాడు. రూ.1.5 లక్షలు చెల్లిస్తే రెండు పడక గదుల ఇల్లు ఇప్పిస్తానంటూ బంధువు ఆడూరి మురళీ కృష్ణమూర్తికి చెప్పాడు. ఇలా పలువురికి ఆశచూపి డబ్బులు వసూలు చేశాడు. మోసపోయిన ఓ బాధితురాలు ఫిబ్రవరిలో దుండిగల్‌ ఠాణాలో ఫిర్యాదు చేయగా పోలీసులు ఏడుగురి ముఠాను అరెస్ట్‌ చేసి రూ.1.25 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. తాజాగా మరికొందరు బాధితులు పోలీసులను ఆశ్రయించగా దర్యాప్తు చేసిన పోలీసులు గతంలో అరెస్టై బెయిల్‌పై విడుదలైన వరప్రసాదే సూత్రధారి అని తేల్చారు. మురళీ కృష్ణమూర్తి తన మిత్రుడు ఏపూరి వెంకటేశ్వరరాజును వరప్రసాద్‌కు పరిచయం చేయగా, వెంకటేశ్వరరాజు తన బంధువు కల్లెపల్లి పద్మా దుర్గను పరిచయం చేశాడు. ఆమె ఇళ్లు ఆశచూపి పలువుర్ని నమ్మించి రూ.47.6 లక్షలు వసూలు చేసింది. రూ.44 లక్షలు వెంకటేశ్వరరాజుకు ఇచ్చింది. వెంకటేశ్వరరాజు రూ.53.57 లక్షలు వసూలు చేశాడు. వరప్రసాద్‌కు రూ.27.7 లక్షలు ఇవ్వగా తాడేపల్లిగూడెంలో రూ.29.5 లక్షలతో భూమి కొనుగోలు చేశాడు. ముగ్గుర్ని అరెస్టు చేశారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.