close

బుధవారం, అక్టోబర్ 21, 2020

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
బల్దియా ఎన్నికల్లో బ్యాలెట్‌ బాక్సులు

కరోనా నేపథ్యంలో వాటి వినియోగంపై చర్చ

అధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథిఫ సమావేశం


సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్‌ బాక్సులు వినియోగించే అవకాశం ఉంది. త్వరలోనే దీనిపై అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నారు. వచ్చే ఏడాది జరగబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథిఫ తన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. పోలింగ్‌ సందర్భంగా కరోనా ప్రబలకుండా నివారించేందుకు బ్యాలెట్‌ బాక్సులు ఉపయోగించే అంశం సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. రాబోయే రోజుల్లో పరిస్థితులను గమనించాక దీనిపై నిర్ణయం తీసుకోవాలని భావించారు. జీహెచ్‌ఎంసీలో అన్నిస్థాయిల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ‘టి-పోల్‌’ సాఫ్ట్‌వేర్‌పై శిక్షణ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు వీలుగా జీహెచ్‌ఎంసీ పరిధితోపాటు చుట్టుపక్కల జిల్లాల్లోని ఉద్యోగుల సమాచార సేకరణకు ముందస్తు కార్యాచరణ మొదలుపెట్టాలని, ఆ సమాచారంతో ప్రత్యేక డేటాబేస్‌నూ సిద్ధం చేయాలని సూచించారు. అక్టోబరు రెండో వారంలో జోనల్‌ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లతో సమావేశం నిర్వహించడంతోపాటు ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రణాళిక రూపొందించాలని, ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులను సత్వరమే పూర్తిచేయాలని సమావేశం నిర్ణయించింది. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌కుమార్‌, అదనపు సీఈవో జ్యోతి బుద్ధప్రకాశ్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

800 మందికి ఓ పోలింగ్‌ కేంద్రం

కొవిడ్‌ వ్యాప్తిని నిలువరించేందుకు పోలింగ్‌ కేంద్రాల సంఖ్యను దాదాపు రెట్టింపు చేయనున్నారు. ఇటీవల పార్లమెంటు ఎన్నికల్లో గ్రేటర్‌ పరిధిలో 6,900 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఒక్కో కేంద్రానికి 1500 మంది ఓటర్లను కేటాయించారు. ప్రస్తుతం ప్రతి 800 మంది ఓటర్లకు ఒకటి ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఆ లెక్కన కేంద్రాల సంఖ్య 12,000కు పెరిగే సూచనలున్నాయి.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.