
87 వేల ప్రచార తెరల తొలగింపు
కొరడా
ఎన్నికల ప్రవర్తన నియమావళిలో భాగంగా నగరంలో ఇప్పటివరకు 87వేలకు పైగా ప్రచార తెరలను జీహెచ్ఎంసీ తొలగించిందని ఈవీడీఎం డైరెక్టర్, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు నోడల్ అధికారి విశ్వజిత్ కంపాటి వెల్లడించారు. మోడల్ కోడ్ అమల్లోకి వచ్చిన రోజు నుంచి గురువారం వరకు 12,500 బ్యానర్లు, 16,040 పోస్టర్లు, 4,231 బోర్డులు, 16,977 ఫ్లెక్సీలు, 37,650 జెండాలను తొలగించినట్లు తెలిపారు. నగరంలో అనుమతి లేకుండా వివిధ పార్టీలు, నాయకులు ఏర్పాటుచేసిన ప్రచార తెరలను తొలగించేందుకు 20 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని.. కోడ్ పటిష్టంగా అమలుచేసేందుకు సర్కిళ్ల వారీగా నిఘా బృందాలను నియమించామని విశ్వజిత్ తెలిపారు.
Tags :