
బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్యపై కేసు
ఉస్మానియా యూనివర్సిటీ: భాజపాయువ మోర్చా (బీజేవైఎం) జాతీయ అధ్యక్షుడు, బెంగళూరు ఎంపీ తేజస్వీ సూర్యపై హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇన్స్పెక్టర్ రాజశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 24న యూనివర్సిటీ అధికారుల అనుమతి లేకుండా ఓయూ క్యాంపస్ గేటు విరగ్గొట్టి, ఆర్ట్స్ కళాశాల ఆవరణలో సమావేశం నిర్వహించారు. ఓయూ రిజిస్ట్రార్ ప్రొ.గోపాల్‌రెడ్డి ఫిర్యాదుతో తేజస్వీ సూర్యతోపాటు ఇతరులపై కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.
Tags :