ఇది పక్కా!
ఈనాడు డిజిటల్, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణకు 30 సర్కిళ్లకుగాను 30 డీఆర్సీ(డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, కౌంటింగ్) కేంద్రాలను అధికారులు ఏర్పాటుచేశారు. ఈ కేంద్రాల్లో ఎన్నికల సామగ్రి పంపిణీ, బ్యాలెట్ పెట్టెలను భద్రపరచడంతో పాటు ఓట్లనూ ఇక్కడే లెక్కిస్తారు. ఈ 30 కేంద్రాల్లో వార్డుకో స్ట్రాంగ్‌రూమ్, ఓ కౌంటింగ్ హాల్‌ను కేటాయించారు. ఒక్కో గదిలో 14 టేబుళ్లను రెండు వరుసల్లో ఎదురెదురుగా ఉంచనున్నారు. ఓటర్ల సంఖ్యను బట్టి వరసలను వినియోగించనున్నారు. డిసెంబరు 1 న పోలింగ్ జరగనుండగా.. 4వ తేదీ ఉదయం 8గంటల నుంచి ఈ కేంద్రాల్లో లెక్కింపు ప్రారంభమవుతుంది. యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది.