
తెరాసపై అభ్యంతరకర పోస్టు.. కేసు నమోదు
నాగోలు, న్యూస్‌టుడే: మన్సూరాబాద్‌కు చెందిన నిమ్మగోని నవీన్ ఈనెల 25న తెరాస ఎన్నికల సభలో ఉండగా అతని చరవాణిలోని ట్విటర్ యాప్‌కు హైందవరెడ్డి పేరుతో ఓ ట్వీట్ వచ్చింది. అందులో తెరాస జెండాను కిందపడేసి కాలితో తొక్కుతున్న చిత్రాన్ని అభ్యంతరకరంగా పెట్టడంపై నవీన్ మనస్తాపం చెందారు. దీనిపై ఎల్బీనగర్ ఠాణాలో ఫిర్యాదు చేయగా గురువారం కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ అశోక్‌రెడ్డి తెలిపారు.
Tags :