
పోలింగ్ కేంద్రాల్లోసౌకర్యాలు
చకచకా
ఈనాడు, హైదరాబాద్: మహానగరంలో ఎన్నికల ఏర్పాట్లు చకచకా కొనసాగుతున్నాయి. 9,101 పోలింగ్ కేంద్రాల వద్ద సౌకర్యాలను యుద్ధ ప్రాతిపదికన సమకూర్చుతున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలింగ్ అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇవ్వడంతో పాటు డీఆర్సీ కేంద్రాల వద్దకు బ్యాలెట్ పత్రాలను తరలించేందుకు అవసరమైన చర్యలను జీహెచ్ఎంసీ చేపట్టింది. ఇక. డీఆర్సీ కేంద్రాల వద్ద 24 గంటలూ పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు.
స్ట్రాంగ్ రూంల వద్ద
బూత్‌ల వద్ద విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి డీఆర్సీ(డిస్ట్రిబ్యూషన్..రిసీవింగ్ సెంటర్)ల వద్ద పోలింగ్ అధికారులు సూచనలిస్తున్నారు. పోలింగ్ కేంద్రం పరిధిలోని ఓటర్ల సంఖ్య ఆధారంగా బ్యాలెట్ పత్రాల లెక్కలను పరిశీలిస్తున్నారు. వాటి లెక్కింపు పూర్తయ్యాక బూత్‌ల వారీగా విడగొట్టి భద్రపరచాల్సి ఉంటుంది. సోమవారం మధ్యాహ్నం నుంచి బ్యాలెట్ పత్రాలను పోలింగ్ అధికారులు, సిబ్బందికి పంపిణీ చేస్తారు. అలానే పోలింగ్ పూర్తయ్యాక బ్యాలెట్ పెట్టెలను భద్రపరిచే స్ట్రాంగ్‌రూంల వద్ద ప్రస్తుతం మూడంచెల భద్రత ఉంది.