
కొండలపై వడ్డెరలకు హక్కు: మంత్రి ఈటల
గన్నుదెబ్బ సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ఈటల. చిత్రంలో ఎమ్మెల్యేలు
బోరబండ, న్యూస్‌టుడే: రాళ్లు కొట్టే వడ్డెరలకు కొండలపై హక్కు కల్పిస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. రహ్మత్‌నగర్ డివిజన్ ఇందిరానగర్‌లో రాష్ట్ర వడ్డెరసంఘం (గన్నుదెబ్బ) ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన సమావేశంలో జూబ్లీహిల్స్, చొప్పదండి ఎమ్యెల్యేలు మాగంటి గోపీనాథ్, రవిశంకర్, తెరాస అభ్యర్థి సి.ఎన్.రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు.
Tags :