Published : 05/12/2020 03:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సాగు మెలకువల తీరుపై అవగాహన

వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలిస్తున్న సంగారెడ్డి జిల్లా విత్తన డీలర్లు

ఆర్మూర్‌, న్యూస్‌టుడే: విజ్ఞానయాత్రలో భాగంగా సంగారెడ్డి జిల్లాకు చెందిన విత్తన డీలర్ల బృందం వ్యవసాయశాఖ ‘డైసీ’ శిక్షణా కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలం అంకాపూర్‌ను శుక్రవారం సందర్శించారు. వ్యవసాయ రంగంపై శిక్షణ పొందుతున్న 40 మంది విత్తన డీలర్లు విశ్రాంత డీడీఏ, సమన్వయకర్త గులాం మహబూబ్‌, రైతు శిక్షణా కేంద్రం అధికారి జి.రమేష్‌ ఆధ్వర్యంలో గ్రామానికి వచ్చారు. పల్లెలో పసుపు, ఎర్రజొన్న, కూరగాయలు, గట్లపై వేసిన కంది పంట, నీటి నిల్వ ట్యాంకులను వారు పరిశీలించారు. గ్రామస్థులు అనుసరిస్తున్న ఆధునిక వ్యవసాయ పద్ధతులను తెలుసుకున్నారు. అనంతరం గురడిరెడ్డి రైతుసంఘం భవనంలో నిర్వహించిన సమావేశంలో సంఘం అధ్యక్షుడు పేట భాస్కర్‌రెడ్డి, కార్యదర్శి సామ చిన్నగంగారెడ్డి, కేకే.భాజన్న రైతు సంఘం కార్యకలాపాలు, పంటల సాగు తీరును వివరించారు. ఈ ప్రాంత రైతులు అనుసరిస్తున్న వ్యవసాయ పద్ధతులు తమను ఎంతగానో ఆకట్టుకున్నాయని సంగారెడ్డి జిల్లా విత్తన డీలర్లు, అధికారులు తెలిపారు. ప్రత్యేకించి రైతు సంఘం కార్యకలాపాలు, కర్షకులకు అన్నివిధాల అండగా నిలుస్తున్న విధానం ప్రశంసనీయమని విశ్రాంత డీడీఏ పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని