
నిర్మాణాల్లో జాప్యం తగదు
అదనపు కలెక్టర్ చంద్రయ్య
బాకాపూర్లో చెత్తదిబ్బను పరిశీలిస్తున్న చంద్రయ్య
పూడూరు, న్యూస్టుడే: గ్రామాల్లో చేపట్టిన వైకుంఠధామాలు, చెత్తదిబ్బల నిర్మాణాల్లో జాప్యం తగదని అదనపు కలెక్టర్ చంద్రయ్య పేర్కొన్నారు. మండల పరిధిలోని బాకాపూర్, చన్గోముల్ గ్రామాలను ఆయన శుక్రవారం సందర్శించారు. బాకాపూర్లో చెత్తదిబ్బ నిర్మాణం పూర్తయినా రంగు వేయించక పోవటంతో పాటు ఇంకా ప్రారంభించక పోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని గ్రామాల్లో పనులు వేగవంతం చేసి వారం పది రోజుల్లోగా నిర్మాణాలను పూర్తిచేయాలని ఆదేశించారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే అధికారులను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఉష సర్పంచులు శివయ్య, మల్లిక ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.
Tags :