Published : 05/12/2020 04:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పార్టీలు మారారు... ప్రభావం చూపారు

బల్దియా ఫలితాల్లో గట్టిపోటీ ఇచ్చిన అభ్యర్థులు

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌, న్యూస్‌టుడే యంత్రాంగం: గ్రేటర్‌ ఎన్నికల ఫలితాల్లో ఈ దఫా చివరిరౌండ్‌ వరకూ ఉత్కంఠ నెలకొంది... అభ్యర్థుల మధ్య అనుక్షణం గెలుపోటములు దోబూచులాడాయి.

* జగద్గిరిగుట్ట డివిజన్‌ తెరాస నేత మహేశ్‌ యాదవ్‌ ఆ పార్టీ తరఫున టికెట్‌ ఆశించారు. దక్కకపోవడంతో భాజపాలో చేరి అదే డివిజన్‌ నుంచి బరిలో నిలిచారు. 479 ఓట్ల తేడాతో తెరాస అభ్యర్థి జగన్‌ చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక్కడ చివరివరకు ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ కొనసాగింది.

* ఫతేనగర్‌ డివిజన్‌ నుంచి పోటీచేసిన ముద్దాపురం కృష్ణాగౌడ్‌ ఇటీవలే తెదేపా నుంచి నుంచి భాజపాలో చేరారు. సొంత పార్టీ నుంచే రెబల్‌ అభ్యర్థి బరిలో ఉండటంతో ఓట్లు చీలిపోయాయి. తెరాస అభ్యర్థి పండాల సతీష్‌గౌడ్‌ చేతిలో 2,495 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. భాజపా రెబల్‌ అభ్యర్థి మహేందర్‌ 1289 ఓట్లు సాధించారు.

* 2009లో ఎర్రగడ్డ డివిజన్‌ కార్పొరేటర్‌గా పనిచేసిన కంజర్ల సదాశివయాదవ్‌ 2016 ఎన్నికల సమయంలో తెరాసలో చేరారు. ఈ ఎన్నికల్లో భాజపా తీర్థం పుచ్చుకున్న ఆయన సనత్‌నగర్‌ నుంచి తన సతీమణి కంజర్ల అన్నపూర్ణను బరిలో నిలిపారు. తెరాస అభ్యర్థి కొలన్‌ లక్ష్మీ చేతిలో 2,429 ఓట్ల తేడాతో ఆమె ఓటమి చెందారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని