Published : 05/12/2020 04:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భద్రత పటిష్ఠం.. ఫలితం ప్రశాంతం

సమన్వయంతో వ్యవహరించిన ముగ్గురు పోలీసు కమిషనర్లు

ఈనాడు,హైదరాబాద్‌: బల్దియా ఎన్నికలకు నోటిఫికేషన్‌ నుంచి ఎన్నికల ఫలితాల వరకూ ముగ్గురు పోలీస్‌ కమిషనర్లు చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిచ్చాయి. ప్రచారపర్వం మొదలైనప్పటి నుంచి ఫలితాలు వెలువడేంత వరకూ స్వల్ప ఘటనలు మినహా ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 9101 పోలింగ్‌ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. దీంతో స్వేచ్ఛాయుత వాతావరణంలో పౌరులు ఓటు వేయడంతో హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్లలో పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ముగ్గురు పోలీస్‌ కమిషనర్లు వి.అంజనీ కుమార్‌, వి.సి.సజ్జనార్‌, మహేష్‌ భగవత్‌లు సమన్వయంతో వ్యవహరించారు.

ఒక్కో డీఆర్‌సీ కేంద్రం బాధ్యతను ఒక్కో పోలీసు అధికారికి అప్పగించారు. డీఆర్‌సీ కేంద్రాల లోపల, వెలుపల సీసీ కెమెరాలను సైతం అమర్చారు. కౌంటింగ్‌ ప్రక్రియ సాఫీగా కొనసాగేలా చర్యలు చేపట్టారు. జంగమ్మెట్‌ డివిజన్‌ ఓట్ల లెక్కింపు సందర్భంగా గొడవ జరగడంతో పోలీసులు సత్వరమే స్పందించి ఘర్షణ పెద్దది కాకుండా నివారించారు. బీఎన్‌రెడ్డి నగర్‌లో ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక భాజపా, తెరాస అభ్యర్థుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా రెండు పార్టీల వారిని చెదరగొట్టారు. అల్వాల్‌లోని లయోలా కళాశాల అకాడమీలో భాజపా కార్యకర్తలు ఆందోళనకు దిగడం, పోలింగ్‌ అధికారులపై దూసుకెళ్లడంతో పోలీసులు లాఠీఛార్జి చేశారు. కొందరిని శామీర్‌పేట ఠాణాకు తరలించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని