
రిటర్నింగ్ అధికారిపై పోలీసులకు ఫిర్యాదు
నేరేడ్మెట్, న్యూస్‌టుడే: నేరేడ్మెట్ డివిజన్ రిటర్నింగ్ అధికారి లీనాపై చర్యలు తీసుకోవాలని భాజపా అభ్యర్థి ప్రసన్ననాయుడు నేరేడ్మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కౌంటింగ్ హాల్లో చెల్లని ఓట్లను తెరాస అభ్యర్థి ఖాతాలో వేయడమే కాకుండా 50వ పోలింగ్ బూత్‌లోని బ్యాలెట్ బాక్స్ ఓట్లను లెక్కించకుండా తెరాస అభ్యర్థికి అనుకూలంగా వ్యవహరించారన్నారు. ఈ విషయమై ప్రశ్నిస్తే తనను కౌంటింగ్ కేంద్రం నుంచి పంపించేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Tags :