
ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ పరిశ్రమ: కేటీఆర్
హైదరాబాద్: ఐటీ పరిశ్రమను మరిన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఐటీ, పరిశ్రమల శాఖలపై మంత్రి కేటీఆర్ ఇవాళ సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌లోని ఇతర ప్రాంతాలు, రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ పరిశ్రమను విస్తరిస్తామని చెప్పారు. త్వరలోనే కొంపల్లి ఐటీ పార్క్‌కు శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. వరంగల్ ప్రాంతానికి వెళ్లేందుకు ఐటీ పరిశ్రమలు ఆసక్తి కనబరుస్తున్నాయన్నారు. డిసెంబర్ 7న ఖమ్మం ఐటీ టవర్‌ను ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. సులభతర వాణిజ్యం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) ర్యాంకుల్లో రాష్ట్రం మెరుగైన స్థానం సంపాదించాలని.. ఆ దిశగా కృషి చేయాలని అధికారులకు కేటీఆర్ సూచించారు.
Tags :