Published : 22/01/2021 01:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నిబంధనల పాటింపు సామాజిక బాధ్యత: ఆర్టీఓ

పరిగిలో మాట్లాడుతున్న సీఐ లక్ష్మిరెడ్డి

వికారాబాద్‌, న్యూస్‌టుడే: వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలను పాటించడం సామాజిక బాధ్యతగా భావించాలని జిల్లా రవాణా అధికారి బి.భద్రునాయక్‌ అన్నారు. గురువారం 32వ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా జిల్లా రవాణా కార్యాలయం మీదుగా రాకపోకలు సాగించే వాహనాలను తనిఖీ చేయగా, శిరస్త్రాణం ధరించకుండా వెళ్తున్న 64 మంది ద్విచక్ర వాహనదారులు, సీటు బెల్టు ధరించకుండా వెళ్తున్న 4 కార్ల చోదకులు, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకున్న 5 ఆటోల చోదకులతో సమావేశం నిర్వహించి ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన కల్పించారు.

* ధారూర్‌లో ఎస్‌ఐ సురేష్‌, దోమలో ఎస్‌ఐ నాగరాజు వాహనదారులకు అవగాహన కల్పించారు.

పరిగి: పరిగి సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మిరెడ్డి గురువారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఎస్సై డానియల్‌ మాట్లాడారు.

నాగిరెడ్డిపల్లి (బొంరాస్‌పేట), న్యూస్‌టుడే: మీ ఊరు బీజాపూర్‌- హైదరాబాద్‌ జాతీయ రహదారిపై ఉండటంతో ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని ఏఎస్సై సత్యశీలారెడ్డి అన్నారు.

మోమిన్‌పేట, న్యూస్‌టుడే: మోమిన్‌పేట వలయాధికారి వెంకటేశం మోమిన్‌పేట అంబేడ్కర్‌ కూడలి దగ్గర వాహన చోదకులకు గులాబి పువ్వులు ఇస్తూ నియమాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్సై రవికుమార్‌, పీఎస్సై అనిత, ఏఎస్సై రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని