Published : 22/01/2021 01:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

విమర్శలు వద్దు: భాజపా

వికారాబాద్‌టౌన్‌: భాజపాను విమర్శించడం మానుకుని, అభివృద్ధిపై దృష్టి సారించాలని జిల్లా అధ్యక్షుడు సదానంద్‌రెడ్డి ఎమ్మెల్యేలకు సూచించారు. గురువారం నాగేష్‌గుప్తా గార్డెన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యమాలతో తెచ్చుకున్న తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలు వస్తాయని భావించిన వారికి నిరాశే మిగిలిందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేరేలా చేస్తే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షురాలు సుచరిత, దళితమోర్చా అధ్యక్షుడు నవీన్‌, యువమోర్చా అధ్యక్షుడు రాజు, నాయకులు వివేకానందారెడ్డి, పాండుగౌడ్‌, రాజేందర్‌రెడ్డి, శివప్రసాద్‌, మధు, వెంకటయ్య, రాజేందర్‌, సాయికృష్ణ పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని