
జిల్లాలో నాలుగో రోజు టీకా పంపిణీ
తాండూరు జిల్లా ఆస్పత్రిలో 39 మందికి
తాండూరులో ఐసీడీఎస్ అధికారిణికి టీకా వేస్తున్న సిబ్బంది
తాండూరు టౌన్, న్యూస్టుడే: జిల్లా వ్యాప్తంగా గురువారం నాలుగో రోజు కరోనా నివారణ టీకాలు ఇచ్చారు. తాండూరు, వికారాబాద్, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల్లోని ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఈ కార్యక్రమం కొనసాగింది. వైద్యాధికారులు, సిబ్బంది, ఐసీడీఎస్ అధికారులకు టీకాలు వేశారు. తాండూరు జిల్లా ఆస్పత్రిలో 39 మందికి టీకాలు వేశారు. శుక్రవారం సైతం టీకాలు వేయటానికి అధికారులు ఏర్పాట్లు చేశారు.
Tags :