Published : 22/01/2021 01:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పార్టీలన్నీ మోసం చేశాయి: మందకృష్ణ


మాట్లాడుతున్న మందకృష్ణ మాదిగ

తాండూరు టౌన్‌, న్యూస్‌టుడే: ఎస్సీ వర్గీకరణపై అన్నీ రాజకీయ పార్టీలు తమను మోసం చేశాయని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. వికారాబాద్‌ జిల్లా తాండూరులో గురువారం జరిగిన ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎస్సీలను ఏబీసీడీలుగా వర్గీకరించాలని 26 ఏళ్లుగా పోరాటం చేస్తున్నా, కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలు పట్టించుకోవడంలేదన్నారు. కాంగ్రెస్‌, భాజపా, తెరాస, ఇతర పార్టీలు మద్దతు ఇస్తామని ప్రకటించి విస్మరించాయని విమర్శించారు. ఉన్నత స్థానాల్లో మాదిగలు లేకపోవటం వల్లే అడ్డంకులు ఎదురవుతున్నాయని, అయినా అంతిమంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అత్యధికంగా సంఖ్యలో ఉన్న మాదిగలకు, ప్రభుత్వంలో ప్రాతినిధ్యం కల్పించలేని ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని ఎద్దేవా చేశారు. మీరంతా అండగా నిలబడితే రాష్ట్రాన్ని పరిపాలిద్దామని పిలుపునిచ్చారు. నేను పార్టీని, జెండాను మార్చ లేదు, అజెండా మరవ లేదని పేర్కొన్నారు. మీరూ ఇదే సూత్రాన్ని పాటిస్తే అధికారం సాకారం అవుతదని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బాధ్యుడు బాబు, వికారాబాద్‌ జిల్లా సమన్వయ కర్త ఆనంద్‌ కుమార్‌, మహిళా నాయకురాలు అన్నపూర్ణ, జిల్లా నాయకులు మల్లికార్జున్‌ పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని