
స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దుతాం
చెత్త బుట్టలు పంపిణీ చేస్తున్న ఛైర్మన్ అశోక్‌కుమార్
పరిగి: స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నట్లు పరిగి పురపాలక సంఘం ఛైర్మన్ అశోక్‌కుమార్ అన్నారు. గురువారం పట్టణంలోని ఆరో వార్డులో కమిషనర్ ప్రవీణ్‌కుమార్, కౌన్సిలర్ నాగేశ్వర్రావుతో కలిసి చెత్త బుట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తడి, పొడి చెత్తను వేర్వేరుగా వేయాలని ప్రజలకు సూచించారు. పరిశుభ్రమైన పట్టణంగా మార్చడం అందరి బాధ్యత అన్నారు. కార్యక్రమంలో పలువురు కాలనీ వాసులు పాల్గొన్నారు.
Tags :