Published : 22/01/2021 03:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భార్యను హత్య చేసిన భర్త

రాయదుర్గం, న్యూస్‌టుడే: భార్యను దారుణంగా హత్య చేసిన ఘటన రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. కర్ణాటకలోని బీదర్‌ జిల్లా హుమ్నాబాద్‌ నిర్ణ గ్రామానికి చెందిన మహ్మద్‌ మొహ్‌సిన్‌ఖాన్‌(31) అదే ప్రాంతంలో కిరోసిన్‌ డీలర్‌గా పనిచేస్తుంటాడు. ఇతనికి మహారాష్ట్ర నాందెడ్‌ జిల్లా కిన్వత్‌ గ్రామానికి చెందిన ఫర్హానా ఖురేషీ (25)తో రెండేళ్ల క్రితం పరిచయమయింది. ఆమెకు అప్పటికే రెండు పెళ్లిళ్లు కాగా ముగ్గురు పిల్లలున్నారు. అయినా ఇద్దరు సహజీవనం చేశారు. ఐదు నెలల క్రితం నగరానికి వచ్చారు. అంజయ్యనగర్‌లో ఓ గది అద్దెకు తీసుకుని జీవనం సాగిస్తున్నారు. కొన్నాళ్ల తర్వాత చెడు తిరుగుళ్లు తిరుగుతున్నావంటూ భార్యతో భర్త గొడవ పడుతుండేవాడు బుధవారం రాత్రి ఇద్దరు గొడవపడ్డారు. ఈ క్రమంలో భర్త కత్తితో ఆమె కడుపులో పొడవడమేకాక గొంతు కోశాడు. గమనించిన స్థానికులు డయల్‌ 100కు ఫోన్‌ చేయగా ఆమెను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని