Published : 22/01/2021 03:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఐఐటీహెచ్‌ అభివృద్ధికి జైకా రూ.1600 కోట్ల రుణం

సంగారెడ్డి టౌన్‌, న్యూస్‌టుడే: ట్రాఫిక్‌ నియంత్రణపై అధ్యయనం కోసం ఐఐటీహెచ్‌, జపాన్‌ ఇంటర్నేషనల్‌ కోఆపరేషన్‌ ఏజెన్సీ(జైకా) ఆధ్వర్యంలో గురువారం ఆన్‌లైన్‌ వేదికగా సంయుక్త సమన్వయ కమిటీ ఐదో సమావేశం నిర్వహించారు. సమావేశాన్ని ఉద్దేశించి జైకా ఇండియా ముఖ్య ప్రతినిధి మాటుసుమోటో మాట్లాడుతూ... ఈ అధ్యయనంతో భవిష్యత్తులో ఇండియా, జపాన్‌ దేశాలకు మేలు చేకూరనుందన్నారు. సంయుక్తంగా చేపట్టిన ప్రాజెక్టులతో సత్ఫలితాలు ఉంటాయని తెలిపారు. జైకా ద్వారా ఐఐటీహెచ్‌ అభివృద్ధికి రూ.1,600కోట్లు రుణంగా అందిస్తున్నట్లు వివరించారు. అంతర్జాతీయ స్థాయి అతిథి గృహం, క్రీడల సముదాయం, టెక్నాలజీ, కన్వెన్షన్‌ సెంటర్లు, పరిశోధన కేంద్రాల సముదాయం, నాలెడ్జ్‌ సెంటర్‌, ప్రయోగశాలల్లో పరికరాలు కొనుగోలుకు ఈ నిధుల్ని వినియోగించనున్నారని పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని