Published : 22/01/2021 03:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలతో నిలువు దోపిడీ


సైబర్‌ దొంగల ముఠా

నారాయణగూడ, న్యూస్‌టుడే: సామాజిక మాధ్యమాల వేదికగా ద్విచక్రవాహనాలు, కార్లు, ఇతర వస్తువులను అమ్ముతామని ప్రకటనలు గుప్పించి అమాయక ప్రజలను బోల్తా కొట్టిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్‌ వెళ్లి అరెస్టు చేసి తీసుకొచ్చి గురువారం రిమాండ్‌కు తరలించారు. హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ నవీన్‌ వివరాల ప్రకారం.. 2019 నవంబరులో కార్వాన్‌ ప్రాంతానికి చెందిన ప్రైవేటు ఉద్యోగి ఎ.అభిలాష్‌కు కారు అమ్ముతానంటూ ఒకరు నమ్మించారు. నిందితుడు నగదు ఆన్‌లైన్‌లో బదిలీ చేయించుకుని మోసం చేశాడు. బాధితుడు సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు విచారణ చేపట్టి గత వారం ఆ నిందితులను రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌ జిల్లా, జర్‌హిరా పోలీసులు అరెస్టు చేశారని తెలుసుకుని.. అక్కడికి వెళ్లారు. అక్కడి నుంచి ఏడుగురు నిందితులు అజ్రుద్దీన్‌ఖాన్‌ (21), హసన్‌ఖాన్‌ (42), అలీముహమ్మద్‌ (48), అఖ్తర్‌ఖాన్‌ (38), సద్దాంఖాన్‌ (27), షోయబ్‌ఖాన్‌ (19), సద్దాంఖాన్‌ (22)లను హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. వారిని తీసుకొస్తుండగా కొందరు దుండగులు దాడి చేసి, రెండు పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. ఎట్టకేలకు స్థానిక పోలీసుల సహకారంతో తీసుకొచ్చామని, వారి నుంచి 173 సిమ్‌కార్డులు, 35 ఐఎంఈఐ నంబర్లు, 42 ఖాతాలను స్వాధీనం చేసుకున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని