Published : 22/01/2021 03:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టీఎస్‌ఎస్‌పీ కానిస్టేబుల్‌ ఆత్మహత్య


మలిశెట్టి రాజేశ్వర్‌

సనత్‌నగర్‌, న్యూస్‌టుడే: ‘నా చావుకు భార్య, అత్తామామలే కారణం. మరణానంతరం ఆస్తులు పిల్లలకు మాత్రమే చెందాల’ని లేఖ రాసి తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీసు విభాగం(టీఎస్‌ఎస్‌పీ)లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సనత్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డి వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్‌కు చెందిన మలిశెట్టి రాజేశ్వర్‌(45) 2005లో టీఎస్‌ఎస్‌పీ కానిస్టేబుల్‌గా చేరారు. తొలుత నల్గొండలోని 12వ పటాలంలో పనిచేసిన ఆయన.. అనంతరం యూసుఫ్‌గూడలోని మొదటి పటాలంలోకి బదిలీ అయ్యారు. భార్య కల్పన, ఇద్దరు పిల్లలతో కలిసి బోరబండలోని రామారావునగర్‌లో నివాసం ఉంటున్నారు. గత ఏడాది అక్టోబరులో మద్యం తాగి విధులకు హాజరైనందుకు అధికారులు సస్పెండ్‌ చేశారు. అప్పటి నుంచి ఇంట్లోనే ఉంటున్నారు. ఆస్తుల విషయంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి. ఇటీవల భార్య, పిల్లలు పండగకు స్వగ్రామానికి వెళ్లారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న రాజేశ్వర్‌ బుధవారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ మేరకు అందిన ఫిర్యాదు ఆధారంగా సనత్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని