Published : 22/01/2021 03:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గప్‌‘చిప్‌’గా మోసం... జరిమానాలు స్వల్పం

పెట్రోల్‌ బంకుల్లో దోపిడీ.. ‘సహ’ చట్టం ద్వారా వెలుగులోకి...

ఈనాడు, హైదరాబాద్‌: సాంకేతికతను ఉపయోగించుకుని కొన్ని పెట్రోలు బంకుల నిర్వాహకులు చేస్తున్న మోసాలు అన్నీఇన్నీ కావు. మీటరు రీడింగ్‌ను నియంత్రిస్తూ పెట్రోల్‌ తక్కువ పడేలా చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. అరకొర చర్యలతో తూనికలు, కొలతల శాఖాధికారులు సరిపుచ్చుతున్నారు. ఈ తరహా మోసాలను గతంలో రాచకొండ, సైబరాబాద్‌ పోలీసులు గుట్టురట్టు చేశారు. ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ ఆధ్వర్యంలో రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల అధికారులకు చేసిన సమాచార హక్కు చట్టం దరఖాస్తు ద్వారా ఈ విషయం వెలుగు చూసింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత రెండు జిల్లాల్లోని ఒక్క బంకు యజమానికీ జైలుశిక్ష పడలేదని అధికారులు స్పష్టం చేశారు.

జరిమానాలతో సరి... ఈ తరహా కేసుల్లో మోసం కేసులు పెట్టి ఐపీసీ 418, 420 ప్రకారం ఏడేళ్ల వరకు జైలుశిక్ష పడే వీలుంది. అధికారులు ఇవేమీ పట్టించుకోకుండా జరిమానాతో సరిపెడుతున్నారు. మోసాలకు పాల్పడే వారిపై ఐపీసీ సెక్షన్ల కింద కేసులు పెట్టాలి.. లైసెన్సు రద్దు చేయించాలని ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి అన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని