Published : 22/01/2021 03:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అనిశా వలలో వీఆర్‌వో

జక్కు రవీందర్‌

హబ్సిగూడ, న్యూస్‌టుడే: పట్టాదారు పాసు పుస్తకానికి రూ.2 లక్షలు డిమాండ్‌ చేసిన వీఆర్‌వో అనిశా అధికారులకు చిక్కాడు. నగరానికి చెందిన విజయ్‌పాల్‌రెడ్డికి జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం ద్వారకపేటలో వ్యవసాయ భూమి ఉంది. పట్టాదారు పాసుపుస్తకం పొందేందుకు స్థానిక వీఆర్‌వో జక్కు రవీందర్‌ను ఆశ్రయించారు. రూ.2 లక్షలు ఇస్తే ఇస్తానంటూ వీఆర్‌వో తెలిపారు. విజయ్‌పాల్‌రెడ్డి అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించారు. హబ్సిగూడలోని ఓ హోటల్‌లో.. రవీందర్‌కు ఆ మొత్తాన్ని అందజేశారు. అదే సమయంలో అనిశా అధికారులు చేరుకొని వీఆర్‌వోను పట్టుకున్నారు. నిందితుణ్ని అనిశా కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరిపరిచారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని