Published : 22/01/2021 03:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అవగాహనే అసలైన అస్త్రం!

సైబర్‌ నేరాలపై సమష్టి పోరాటం
‘దిల్‌సే’తో యువతకు సైబర్‌ పాఠాలు
దిల్‌సే వాలంటీర్లతో సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌, కృష్ణ యెదుల

ఈనాడు, హైదరాబాద్‌: ఏటా పెరుగుతున్న సైబర్‌, ఆర్థిక నేరాల కట్టడికి ప్రజలకు అవగాహన కల్పించటం ఉత్తమ మార్గమని సైబరాబాద్‌ సీపీ వి.సి.సజ్జనార్‌ స్పష్టంచేశారు. ప్రపంచవ్యాప్తంగా నేరాలు తగ్గుముఖం పట్టాయని, సైబర్‌ నేరాలు 250 శాతం పెరిగాయని ఆందోళన వెలిబుచ్చారు. కొవిడ్‌ సమయంలో ఈ తరహా నేరాలు రెట్టింపయ్యాయన్నారు. సైబరాబాద్‌ పోలీసులు, సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌, ఎండ్‌నౌ ఫౌండేషన్‌ సంయుక్తంగా చేపట్టిన ‘డిజిటల్‌ లిటరసీ టు సెక్యూర్‌ యూత్‌(దిల్‌సే)’ కార్యక్రమాన్ని గురువారం సైబరాబాద్‌ కమిషనరేట్‌ మందిరంలో ప్రారంభించారు. సీపీ సజ్జనార్‌ మాట్లాడారు. సైబర్‌ నేరాల ఉచ్చులో చిక్కకుండా చైతన్యపరచటమే పరిష్కారమన్నారు. దిల్‌సేతో సమాజంలో సైబర్‌ సైన్యాన్ని తయారు చేయటం తేలిక అవుతుందన్నారు. దేశంలోనే తొలిసారిగా ప్రారంభించిన ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా విస్తరించాలని ఆకాంక్షించారు. ఐటీ ఉద్యోగులు 2000 మంది ట్రాఫిక్‌ వాలంటీర్లుగా సేవలు అందించేందుకు ముందుకొచ్చారని తెలిపారు. ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ.. వాలంటీర్లుగా పనిచేసే వారిలో ఆసక్తి, పట్టుదల, ఓపిక ఉండాలని సూచించారు.


100 మందితో డిజిటల్‌ సైన్యం

హైసియా అధ్యక్షుడు భరణికుమార్‌ అరోల్‌, మాట్లాడుతూ.. నగరంలో ఫిబ్రవరి 6న ప్రారంభమయ్యే శిక్షణకు 100 మందికిపైగా వాలంటీర్లు పేర్లను నమోదు చేసుకున్నారన్నారు. ఎండ్‌నౌ పౌండేషన్‌ వ్యవస్థాపకులు అనిల్‌ రాచమల్లా, ఎస్సీఎస్సీ ప్రధాన కార్యదర్శి కృష్ణ యెదుల పాల్గొన్నారు. దిల్‌సేలో వాలంటీర్‌గా చేరాలనుకొనేవారు 9177283831, ఇ-మెయిల్‌ crm@scsc.in ద్వారా సంప్రదించవచ్చని సూచించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని