Published : 22/01/2021 03:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ట్రాఫిక్‌ కూడళ్లలో 700 గొడుగులు

వేసవిలో కానిస్టేబుళ్లకు ఉపశమనం

20 తీర్మానాలు ఆమోదించిన స్థాయీ సంఘం

సమావేశంలో మేయర్‌ రామ్మోహన్‌ తదితరులు

ఈనాడు, హైదరాబాద్‌: కూడళ్లలో ట్రాఫిక్‌ విధులు నిర్వర్తించే పోలీసులకు తీపి కబురు. వేసవిని దృష్టిలో పెట్టుకొని నగర వ్యాప్తంగా 700 ట్రాఫిక్‌ ఛత్రాలు, ఆయా కూడళ్లలో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేయనున్నామని బల్దియా చెబుతోంది. బీఓటీ పద్ధతిలో ప్రాజెక్టును రూపొందించగా, సంబంధించిన ప్రతిపాదన గురువారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన స్థాయీ సంఘం సమావేశంలో ఆమోదం పొందింది. మేయర్‌ బొంతు రామ్మోహన్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మొత్తం 20 తీర్మానాలు ఆమోదం పొందాయి.

* జీహెచ్‌ఎంసీలోని 3,142 మంది శాశ్వత ఉద్యోగులకు ఆరోగ్య బీమా కల్పిస్తూ స్థాయీ సంఘం నిర్ణయం తీసుకుంది.

* సీఎస్‌ఆర్‌ కింద జూబ్లీహిల్స్‌ రోడ్డు నం.45లో పార్కు అభివృద్ధి, మైండ్‌ స్పేస్‌ కూడలి నుంచి రోలింగ్‌ హిల్స్‌ గచ్చిబౌలి వరకు ఉన్న రహదారి మధ్య భాగాల్లో పచ్చదనం అభివృద్ధిని ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించే తీర్మానాలు ఆమోదం పొందాయి.

* బంజారాహిల్స్‌ రోడ్డు నం.12లోని విరంచి ఆస్పత్రి నుంచి కేబీఆర్‌ పార్కు మీదుగా జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వరకు ఉన్న రోడ్డు మార్గాన్ని 30 నుంచి 36 మీటర్ల మేర విస్తరణకు ఆస్తుల సేకరణకు స్థాయీ సంఘం అంగీకారం తెలిపింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని