
దూరమెరుగని సాయం
వందల కి.మీ. ప్రయాణించి.. బాధితుల చెంతకు
జన్నారం, న్యూస్టుడే: కష్టాల్లో ఉన్నవారికి సేవ చేయాలనే తపన ముందు దూరం వారికి భారంగా అనిపించలేదు. బాధితులకు స్వయంగా సాయం చేయడానికి సుమారు 300 కిలోమీటర్లు ప్రయాణించారు దాతలు. ‘కాళ్లపై నిలబడలేని కుటుంబం’ అనే శీర్షికన ఈ నెల 11న ‘ఈనాడు’లో కథనానికి స్పందించిన హైదరాబాద్కు చెందిన మిత్ర హ్యాండ్స్ ఫౌండేషన్ సభ్యులు స్పందించారు. ఆదివారం మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని రేండ్లగూడకు వచ్ఛి. ఉపారపు రాజవ్వ, ఉపారపు పెద్దులు దంపతులకు ట్రైసైకిల్ అందజేశారు.సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దాముక కమలాకర్, కరాటే మాస్టర్ తౌటు సంజీవు, తాపీ మేస్త్రీ సంఘం అధ్యక్షుడు ముల్కల్ల ప్రభాకర్ పాల్గొన్నారు.
Tags :