
మోదీ హయాంలోనే భారత్ శక్తిమంతం
భాజపా నాయకుడు రాంమాధవ్
మాట్లాడుతున్న రాంమాధవ్, చిత్రంలో టీఎస్ సుధీర్, రాంచందర్‌రావు
జూబ్లీహిల్స్, న్యూస్‌టుడే: దేశాన్ని శక్తివంతంగా నిలుపడంలో మోదీ ప్రభుత్వం ఎన్నో కీలక, వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుందని భాజపా జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ అన్నారు. అయోధ్య, చైనా, కాశ్మీర్ తదితర అంశాలపై ‘బికాజ్ ఇండియా కమ్స్ ఫఫస్ట్’ పేరిట ఆయన ఇటీవల రాసిన పుస్తకంలోని పలు అంశాలను ఆదివారం బంజారాహిల్స్‌లోని తాజ్‌డెక్కన్‌లో ప్రముఖ జర్నలిస్టు టీఎస్ సుధీర్, ఎమ్మెల్సీ రాంచందర్‌రావుతో కలిసి చర్చించారు. రాంమాధవ్ మాట్లాడుతూ.. మోదీ ప్రధాని అయ్యాక ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన సమస్యలకు పరిష్కారం దొరికిందన్నారు. చాలా విషయాల్లో మెజార్టీ ప్రజలు ఆయనకు మద్దతు పలికి ఐకమత్యాన్ని చాటారన్నారు.
Tags :