
రెవెన్యూలో ఉద్యోగాల భర్తీ, పదోన్నతులు చేపట్టాలి
దైనందిని ఆవిష్కరణలో కిషన్‌రెడ్డి, బండి సంజయ్, రాంచందర్‌రావు తదితరులు
ఖైరతాబాద్: రాష్ట్రంలో రెవెన్యూ సంస్కరణలు తీసుకొస్తున్నామని చెబుతున్న తెరాస ప్రభుత్వం ఆ శాఖలో పనిచేసే తహసీల్దార్లు, వీఆర్ఓల సమస్యలు పట్టించుకోవడంలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. జిల్లాలు పెరిగినా ఉద్యోగాల భర్తీ, పదోన్నతులు చేపట్టకపోవడంతో పని భారంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆదివారం రాజ్‌భవన్ రోడ్డులోని దిల్కుషా అతిథి గృహంలో తెలంగాణ తహసీల్దార్ల సంఘం కాలమానిని, దైనందినిని భాజపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్‌రావు, తహసీల్దార్ల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.రాములు, వి.లచ్చిరెడ్డి తదితరులతో కలిసి కిషన్‌రెడ్డి ఆవిష్కరించారు. ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, పలువురు తహసీల్దార్లు పాల్గొన్నారు.
Tags :