
‘మున్నూరుకాపులకు ప్యాకేజీ ప్రకటించాలి’
కాచిగూడ, న్యూస్‌టుడే: కరోనా పరిస్థితులతో ఉపాధి కోల్పోయిన మున్నూరుకాపు రైతులు, రైతు కూలీలను ఆదుకోవాలని తెలంగాణ మున్నూరు కాపు మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు కాశెట్టి ఆనంద్‌కుమార్ విజ్ఞప్తి చేశారు. మున్నూరు కాపులను ఆదుకోవడానికి రూ. 100 కోట్ల ప్యాకేజీ ప్రకటించాలని కోరారు. ఆదివారం కాచిగూడలోని మున్నూరు కాపు సంఘం, మ్యాడం అంజయ్య హాలులో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రధాన కార్యదర్శి మణికొండ రమేశ్‌కుమార్, ట్రస్టీ గంప చంద్రమోహన్, మాణిక్‌ప్రభు, దత్తుమూర్తి, బ్రిజ్మోహన్, ఆది నగేశ్, వెంకటేశ్వర్రావు, వినోద్‌కుమార్, రాధాకృష్ణ, సురేశ్‌బాబు, కనకరాజు, దామెర జ్ఞానేశ్వర్, గడ్డి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Tags :