Published : 25/01/2021 02:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రభుత్వ భూముల విక్రయం

జవహర్‌నగర్‌ ఉప మేయర్‌ సహా ఆరుగురిపై కేసు

జవహర్‌నగర్‌, న్యూస్‌టుడే: ప్రభుత్వ భూములను పేదలకు విక్రయించి మోసగించారనే ఆరోపణలపై జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌ ఉప మేయర్‌ సహా ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జవహర్‌నగర్‌ ఇన్‌ఛార్జి సీఐ మధుకుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. జవహర్‌నగర్‌లోని సర్వే నంబర్లు 613, 614లో ఉన్న ప్రభుత్వ భూములను హరిరామ్‌, మల్లేష్‌గౌడ్‌, ఎల్లయ్య, నాగేశ్‌, గోపాల్‌లతో కలిసి ఉప మేయర్‌ రెడ్డిశెట్టి శ్రీనివాస్‌ తమకు విక్రయించి మోసగించారంటూ బాధితులు కాప్రా తహసీల్దార్‌ గౌతమ్‌కుమార్‌ దృష్టికి తీసుకెళ్లారు. కూరగాయల మార్కెట్‌కు కేటాయించిన స్థలాన్ని ప్లాట్లుగా చేసి విక్రయించారని, తమకు న్యాయం చేయాలని కోరారు. స్పందించిన ఆయన జవహర్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్‌ ఆదేశాల మేరకు ఆరుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని