
గణతంత్ర వేడుకల సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు
నారాయణగూడ, న్యూస్‌టుడే: నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో గణతంత్ర వేడుకల సందర్భంగా ఈనెల 26న ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని, అలాగే వేడుకల్లో పాల్గొనే అతిథుల వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ వెల్లడించారు. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయన్నారు.
* ఎంజే మార్కెట్ వైపు నుంచి మెహిదీపట్నం వైపు వెళ్లు వాహనాలను తాజ్ కూడలి నుంచి ఏక్‌మినార్ మసీదు, బజార్‌ఘాట్, ఆసీఫ్‌నగర్, రెడ్‌హిల్స్/అయోధ్య హోటల్, లక్డీకాపూల్ నుంచి దారి మళ్లిస్తారు.
* నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి పబ్లిక్‌గార్డెన్స్ వైపు అనుమతించరు.
* ఖైరతాబాద్, నిరంకారీ భవనం నుంచి రవీంద్రభారతి వైపు వాహనాలను అనుమతించరు. వాహనాలను పాత సైఫాబాద్ కూడలి నుంచి మళ్లిస్తారు.
* హైదర్‌గూడ, కింగ్‌కోఠి, బషీర్‌బాగ్ బాబుజగ్జీనవ్రాం విగ్రహం కూడలి నుంచి పీసీఆర్ వైపు నుంచి పబ్లిక్‌గార్డెన్స్ వైపు వాహనాలకు అనుమతి లేదు. బషీర్‌బాగ్ కూడలి నుంచి లిబర్టీ, తెలుగుతల్లి, ఎన్టీఆర్ మార్గ్, ఎక్బాల్ మినార్, పాత సైఫాబాద్ ఠాణా, లక్డీకాపూల్ వంతెన, బాబుజగ్జీవన్‌రాం విగ్రహం కూడలి నుంచి అబిడ్స్ వైపు మళ్లిస్తారు.
* ట్యాంక్‌బండ్ నుంచి రవీంద్రభారతి వైపు వెళ్లే వాహనాలను ఎక్బాల్ మినార్ నుంచి సైఫాబాద్ టెలిఫోన్ భవన్ రోడ్డు, పాత సైఫాబాద్ ఠాణా కూడలి, లక్డీకాపూల్ వంతెన వైపు మళ్లిస్తారు.
* నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి పబ్లిక్‌గార్డెన్స్ వైపు వచ్చే వాహనాలను ఏఆర్ పెట్రోల్ బంక్ నుంచి బషీర్‌బాగ్ బీజేఆర్ విగ్రహం, గన్‌ఫౌండ్రి వైపు అనుమతిస్తారు.
* తెలుగుతల్లి కూడలి, ఎన్టీఆర్ మార్గ్, లిబర్టీ వైపు నుంచి, అలాగే ఆదర్శ్‌నగర్ న్యూ ఎమ్మెలే క్వార్టర్స్ నుంచి పోలీసు కంట్రోల్ రూమ్ కూడలి వైపు నుంచి పబ్లిక్‌గార్డెన్స్ వైపు వచ్చే వాహనాలను ఆదర్శ్‌నగర్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్, లిబర్టీ రోడ్డు, తెలుగుతల్లి ఫ్లైఓవర్ వైపు మళ్లిస్తారు.
* వేడుకల్లో పాల్గొనేందుకు జారీ చేసిన పాస్‌లు కలిగినవారికి మాత్రం ట్రాఫిక్ మళ్లింపు పాయింట్ల వద్ద అనుమతిస్తారు. సాధారణ ప్రజలు మాత్రం ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలి.