Published : 25/01/2021 05:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం


ప్రమాద స్థలి దృశ్యం

కాటేదాన్‌, న్యూస్‌టుడే: ఔటర్‌పై అతివేగం మరో ఇద్దరి ప్రాణాలు తీసింది. కర్ణాటక రాష్ట్రం బీదర్‌ జిల్లా ఉల్ఫ ప్రాంతానికి చెందిన డ్రైవర్‌ మున్న(21), క్లీనర్‌ శరత్‌(21)లు తమ గూడ్స్‌ ఆటోలో సెనగలు, కోయ నిండిన సంచులతో పాటు అందులోనే నిషేధంలో ఉన్న జర్దాఖైనీ గుట్కాల సంచులతో నగరానికి వస్తున్నారు. ఆదివారం ఉదయం 7గంటలకు ఔటర్‌రింగురోడ్డు మీదుగా రాజేంద్రనగర్‌ హిమాయత్‌ సాగర్‌ టోల్‌గేట్‌ దాటాల్సిఉంది. కళ్లకు నిద్రలేక వేగంగా వెళుతున్న ఆటో ఔటర్‌ నుంచి కిందకు దిగే మార్గంలో ఒక్కసారిగా అదుపుతప్పింది. డివైడర్‌తో పాటు మార్గాలు సూచించే పెద్దపాటి సిమెంటు పిల్లర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో ముందు భాగం పూర్తిగా నుజ్జుకావడంతో డ్రైవర్‌, క్లీనర్‌ల తల, ఎద భాగాలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ప్రమాద సమాచారమందుకున్న రాజేంద్రనగర్‌ ఎస్సై సమరసింహారెడ్డి, హెడ్‌ కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌లు వెంటనే చేరుకుని పరిశీలించారు. ఇద్దరు దుర్మరణం పాలయ్యారని గుర్తించారు. మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతుల చరవాణులతో వారి ఇళ్లకు ప్రమాద సమాచారం అందించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని