Published : 25/01/2021 17:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

విత్తన రాయితీ కనుమరుగైంది: జీవన్‌ రెడ్డి

హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడిందని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీ ఆవరణలో మీడియాతో ఆయన మాట్లాడారు. రైతులకు వాటిల్లే నష్టాన్ని భర్తీ చేస్తామన్న సీఎం ప్రకటనను జీవన్‌రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు రూ.25వేలలోపు పంట రుణాలను మాత్రమే మాఫీ చేశారని.. మిగిలిన వాటి సంగతేంటని అని ప్రశ్నించారు. రైతుబంధు పేరుతో రైతులకు అందే ప్రయోజనాలు ఇవ్వకుండా చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

‘‘రాష్ట్రంలో విత్తన రాయితీ పూర్తిగా కనుమరుగైంది. వ్యవసాయ యాంత్రీకరణను నిలిపివేశారు. ఉద్యాన విభాగాన్ని నిర్వీర్యం చేశారు. జీతాలు చెల్లించలేక 459మంది ఉద్యాన అధికారులను తొలగించారు. కేంద్రం నిధులను సద్వినియోగం చేసుకోలేదు. పంట రుణాలపై వడ్డీ రాయితీని పూర్తిగా ఎత్తేశారు. రుణమాఫీ, రైతుబంధుపై స్పష్టత లేక అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. పసుపు రైతులు మద్దతు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నారు. పసుపు రైతాంగ సమస్యల విషయంలో రైతులకు సంఘీభావంగా ఈనెల 30న ఆర్మూర్‌లో ఒక రోజు దీక్ష చేపట్టనున్నాం’’ అని జీవన్‌ రెడ్డి వివరించారు. 

ఇవీ చదవండి..
ఎన్నికలను రీషెడ్యూల్‌ చేసిన ఎస్‌ఈసీ

అన్నికోణాల్లో పరిశీలించి నిర్ణయం: విజయసాయి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని