Published : 24/02/2021 03:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బద్దం బాల్‌రెడ్డికి గవర్నర్‌ నివాళి


చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న దత్తాత్రేయ

ఫిలింనగర్‌: దివంగత భాజపా నేత బద్దం బాల్‌రెడ్డి ఆశయాలను నేటి తరం కొనసాగించాలని హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అన్నారు. బద్దం బాల్‌రెడ్డి రెండో వర్ధంతి సందర్భంగా మంగళవారం బంజారాహిల్స్‌లోని ఆయన నివాసానికి దత్తాత్రేయ వచ్చి నివాళులర్పించారు. సతీమణి విజయలక్ష్మి, కుమారులు బీజేవైఎం జాతీయ కార్యదర్శి మహిపాల్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, భూపాల్‌రెడ్డిలను ఆయన పరామర్శించారు. భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతల రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని