Published : 04/03/2021 01:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘జిమ్మిక్కులెన్ని చేసినా భాజపాదే గెలుపు’


మాట్లాడుతున్న బండి సంజయ్‌. చిత్రంలో గౌతంరావు, పాండుయాదవ్‌, తదితరులు

గన్‌ఫౌండ్రి, న్యూస్‌టుడే: శాసనమండలి ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్‌ అబద్ధాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ దుయ్యబట్టారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా భాజపా విజయం ఖాయమన్నారు. బుధవారం రాత్రి నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో భాజపా జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లతో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అవినీతి పెచ్చుమీరిందని, కేసీఆర్‌ తగిన ప్రతిఫలం అనుభవించడం ఖాయమన్నారు. భాజపా కార్యకర్తలపై దెబ్బ పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.ప్రదీప్‌కుమార్‌, భాజపా జిల్లాల అధ్యక్షులు డాక్టర్‌ ఎన్‌.గౌతంరావు (హైదరాబాద్‌ సెంట్రల్‌), వి.పాండుయాదవ్‌ (గోల్కొండ), బి.శ్యామ్‌సుందర్‌గౌడ్‌ (మహంకాళి), సామ రంగారెడ్డి (రంగారెడ్డి అర్బన్‌), పన్నాల హరీశ్‌రెడ్డి (మేడ్చల్‌ అర్బన్‌) తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని