Published : 04/03/2021 01:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాసదే విజయం’


సమాలోచనలు చేస్తున్న ఉప సభాపతి పద్మారావు, మంత్రులు తలసాని, గంగుల

సికింద్రాబాద్‌: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస విజయం ఖాయమని ఉప సభాపతి టి.పద్మారావు ధీమా వ్యక్తం చేశారు. బుధవారం సికింద్రాబాద్‌ నియోజకవర్గం పరిధిలో ఎమ్మెల్సీ ఎన్నికలపై మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్‌, గంగుల కమలాకర్‌లతో ఉప సభాపతి సమీక్షించారు. సీతాఫల్‌మండిలోని పద్మారావు క్యాంపు కార్యాలయంలో ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తీరుపై సమాలోచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ మాట్లాడుతూ.. పార్టీ శ్రేణులు పట్టభధ్రుల ఓటర్లను సమన్వయం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గంగుల మాట్లాడుతూ.. హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిని వాణీదేవీకి పట్టభధ్రుల నుంచి మంచి స్పందన లభిస్తోందన్నారు. సమావేశంలో పార్టీ పరిశీలకుడు శ్రీనివాస్‌, యువనేత కిశోర్‌కుమార్‌ పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని