Updated : 04/03/2021 03:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చిత్ర వార్తలు

బొమ్మాబొరుసా.. నీరాగింది తెలుసా!

శిల్పారామం నుంచి హైటెక్‌ సిటీకి వెళ్లే మార్గంలో విభాగిని మధ్యలో రాతి బొమ్మ చేతి నుంచి వచ్చే నీరు పచ్చికపై పడేలా ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం నీరు మాత్రం రావడం లేదు కానీ అటుగా వెళ్లే వారిని బొమ్మ ఆకట్టుకుంటోంది.


నాలా ఇలా..నడిచేదెలా?

ఎల్‌.బి.నగర్‌ నియోజకవర్గం లింగోజిగూడ డివిజన్‌ జానకి ఎన్‌క్లేవ్‌ కాలనీలో నాలా నిర్మాణం పేరుతో ఏడాది కాలంగా పనులు కొనసా...గుతూనే ఉన్నాయి. నడిచే వీలే లేదు.. వాహనాల సంగతి సరేసరి. ఎప్పటికి పూర్తయ్యేనో!


అందం అపురూపం

 

కొవిడ్‌ సమయంలో ప్రజలను చైతన్యపరిచిన పలువురిని శుక్రవారం సత్కరిస్తారు. ఈ సందర్భంగా మాదాపూర్‌లో హోటల్‌లో బుధవారం రూపదర్శినులు సందడి చేశారు.


అధికారులు రాశారు.. అక్రమార్కులు తుడిచేశారు


వారం క్రితం ప్రభుత్వ స్థలంగా రాస్తున్న సర్వేయర్‌ శ్రీహరి, వీఆర్‌ఓ సాయిరెడ్డి

తాండూరు మండలం గౌతాపూర్‌లో సర్వే సంఖ్య 35లో తాండూరు-చించోళి అంతర్‌రాష్ట్ర రహదారిలో 32.17 ఎకరాల విలువైన ప్రభుత్వ ఉంది. ఆ స్థలంలోని కొంతభాగాన్ని కొందరు ఆక్రమించారు. విషయాన్ని గ్రామస్థులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో సర్వేయర్‌ శ్రీహరి, వీఆర్‌ఓ సాయిరెడ్డిలు కొలతలు చేసి ప్రభుత్వ స్థలంగా పేర్కొంటూ.. వారం క్రితం రంగులతో రాశారు. ఇంతలో అక్రమార్కులు అధికారుల రాతలను చెరిపి తెల్లరంగు వేయడం గమనార్హం.


వివరాలను రంగుతో చెరిపివేసి..

- న్యూస్‌టుడే, తాండూరుగ్రామీణ


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని