Published : 04/03/2021 02:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఉచిత నీరా.. 4 నెలల బిల్లా?

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఉచిత నీరు కావాలనుకుంటున్నారా.. లేక 4 నెలల బిల్లు కావాలా.. మీరే తేల్చుకోండి. గ్రేటర్‌లో గత ఏడాది డిసెంబరు నుంచి పథకాన్ని అమలు చేస్తుండగా నెలకు 20 వేల లీటర్లలోపు వాడే నల్లాదారులు బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేకుండా ప్రస్తుతం జీరో బిల్లులు పంపిణీ చేస్తున్నారు. మార్చి 31లోపు ఆధార్‌తో అనుసంధానం కాకపోయినా.. నీటి మీటరు లేకపోయినా.. వాడుకున్న నీటి మొత్తానికి బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. అలా గత డిసెంబరు నుంచి మార్చి వరకు కలిపి 4 నెలల బిల్లులు ఒకేసారి వస్తాయి. ఆధార్‌ అనుసంధానం, నీటి మీటర్ల ఏర్పాటుకు గడువు తరుముకొస్తున్నా నగర వాసుల్లో స్పందన లేదు. మార్చి 31లోపు ప్రతి నల్లా యజమాని ఆధార్‌ లింకు చేసుకోవడంతోపాటు మీటరు పనిచేస్తూ ఉంటేనే ఈ పథకానికి అర్హులు. ఇప్పటివరకు లింకు చేసుకున్నవారి సంఖ్య 50 వేలు కూడా దాటలేదు. వారంక్రితం వరకు 22 వేల మందే లింకు చేశారు. దిల్లీలో లబ్ధిదారులు 14 లక్షల మంది ఉంటే ఆధార్‌ లింకు, మీటర్ల ఏర్పాటుకు 4 ఏళ్ల సమయం పట్టింది. మరి నగరంలో ఎంతకాలం పడుతుందో. ఇక అపార్ట్‌మెంట్ల వాసులకూ పథకం అమలు చేయనున్నా ప్రతి ఫ్లాట్‌ యజమాని ఆధార్‌ను లింకు చేయాల్సి రావచ్చని అధికారులంటున్నారు. ఇందుకు ప్రత్యేక యాప్‌ సిద్ధమవుతోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని