Updated : 04/03/2021 08:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

స్నేహం ముసుగులో ద్రోహం


నిందితుడు సాయిగణేష్‌

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: ఇంటర్న్‌షిప్‌ కోసం వచ్చిన ఓ యువతితో పరిచయం పెంచుకొని, మాయమాటలతో దగ్గరై ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడో యువకుడు. అమెజాన్‌ సంస్థలో పని చేస్తున్న నిందితుణ్ని జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. జూబ్లీహిల్స్‌ పోలీసుల కథనం ప్రకారం.. యాదాద్రి-భువనగిరి జిల్లా భువనగిరికి చెందిన, సికింద్రాబాద్‌లోని ప్రశాంత్‌నగర్‌లో నివసించే చింతా సాయిగణేష్‌(26) అమెజాన్‌ సంస్థలో టీంలీడర్‌గా పనిచేస్తున్నాడు. పంజాబ్‌కు చెందిన, యూసుఫ్‌గూడలోని ఓ కళాశాల విద్యార్థిని(22) వెంకటగిరిలో ఉంటోంది. ఇంటర్న్‌షిప్‌లో భాగంగా యువతికి ఇతనితో పరిచయం ఏర్పడింది. మూడేళ్లుగా ఆమెతో స్నేహంగా ఉంటూ మాయమాటలతో నమ్మించాడు. నేరుగా యువతి ఇంటికి వెళ్లేవాడు. వారి కుటుంబ సభ్యులతోనూ చనువుగా ఉంటున్నాడు. అతడిని నమ్మిన యువతిని సూర్యలంక బీచ్‌, నగరంలోని ఇతర పర్యటక ప్రాంతాలకు తీసుకెళ్లాడు. ఈ నేపథ్యంలోనే ఓ హోటల్‌ గదిలో అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొద్ది రోజులుగా తప్పించుకొని తిరుగుతున్న నిందితుణ్ని సాంకేతికత ఆధారంగా పోలీసులు అరెస్ట్‌ చేసి కేసులు నమోదు చేశారు. అతడిని కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్‌ విధించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని